ప్రజా భాగస్వామ్యం తో మాత్రమే కోవిడ్ 19 కరోనా ని ఎదుర్కోగలం:
దేశం యొక్క అభివృద్ధి లో, ప్రగతిలో మరీ ముఖ్యం గా విపత్కర పరిస్థితులు వచ్చినపుడు, దేశం ఒక పెద్ద ఛాలెంజ్ ని ఎదుర్కొంటున్నపుడు ఇలా అనేక విషయాల్లో ప్రజలని భాగస్వామ్యం చేయడం ప్రభుత్వం చేసే పని. ఇలా చెయ్యడం వల్ల నిజానికి మెరుగైన ఫలితాలు సాధించడానికి అనుకూలతలు ఉంటాయి.
కానీ విపత్కర పరిస్థితులు ఉన్నపుడు ప్రజలని భాగస్వామ్యం కాకుండా భాద్యులని చేయడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఉదాహరణకి ఇప్పుడు కోవిడ్ 19 అనే కరోనా వైరెస్ దేశం మీద విరుచుకు పడే పరిస్థితులు నెలకొన్నట్టు గా మీడియా లో వస్తున్న వార్తలని చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ ఛాలెంజ్ ని ఎదుర్కొన డానికి మనదేశం యొక్క సంసిద్ధతని ఒకసారి చూసి, ఎదుర్కొనడానికి అనుసరించాలిసిన వ్యూహం గురించి చర్చించుకుందాం.
మనదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే ఒకవేళ ఈ కరోనా కోవిడ్19 కనుక విశృంఖలం గా విస్తరించి నట్లయితే మనం ఎదుర్కోవడానికి సిద్ధం గా ఉన్నామా? అని చూస్తే. మనదేశం లో పరిస్తితులు డేటానీ జనాభా నిష్పత్తిని పరిశీలిస్తే
* ప్రజలు vs డాక్టర్స్ - 11600 మందికి: ఒక డాక్టర్
* Quarantine Beds vs పేషంట్ - 36000 మందికి: ఒక quarantine bed
* ఐసోలేషన్ బెడ్స్ vs పేషంట్ - 84000 మందికి: ఒక ఐసోలేషన్ బెడ్.
Ref:(https://in.news.yahoo.com/amphtml/one-isolation-bed-per-84-220803126.html)
పోనీ మన కోసం పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది కి అయినా సరిఅయిన వసతులు కల్పించే పరిస్థితి అయినా ఉందా అని అంటే? WHO వారు ప్రతిపాదించిన కనీస PPE (పర్సోనల్ ప్రొటెక్షన్ equipment) మన అధికారులు, వైద్య బృందాలు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు మొదలైన వారికి కూడా ఇవ్వలేని పరిస్థితి లో ఉన్నాం.
Ref:(https://scroll.in/article/956866/investigation-crucial-coronavirus-gear-supply-clouded-by-allegations-of-government-malintention)
అలా కాకుండా వ్యాధి ప్రభలితే పరిస్థితి ని నియంత్రణ లోనికి తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి రాకుండా నివారణ చర్యలు అయినా తీసుకుంటే మనం కొంతవరకూ కాపాడబడుతాం అని అనుకుంటే, మన ఎక్కే రైలు జీవితకాలం లేటు అన్న చందం గా ఉన్నట్టు గా తెలుస్తోంది. ఇప్పటి లాక్ డౌన్ చర్యలు అవగాహన కార్యక్రమాలు కనీసం ఒక నాలుగు వారాల ముందు జరిగి ఉంటే ప్రయోజనం ఉండేది అని చెప్తున్నారు. కేవలం మార్చ్ నెలలోనే విదేశాలనుండీ లక్షలాదిగా మనదేశానికి తరలి వస్తే వారి కి మార్చ్ 14 నుండీ కనీస ధర్మల్ టెస్ట్ చేయడం మనం చేసాం. అప్పటికే లక్షలాదిగా విదేశాలనుండీ మనదేశానికి వచ్చి ఇక్కడ ప్రజల్లో కలిసి పోయారు. అలాగే విదేశీ విమానాల్లో ప్రయాణించి మనదేశం వచ్చిన వారి డేటా ఆధారం గా ఈ పాటివారిని కనుక్కుని quarantine కేంద్రాలకు పంపాలిసిన అవసరం ఉండగా మనదేశం లో ఆ స్థాయి infrastructure లేక పోవడం వల్ల ప్రజలని భాద్యులని చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి.
Ref: (https://m.economictimes.com/news/politics-and-nation/india-lockdown-may-be-too-slow-to-stop-millions-of-infections/articleshow/74764299.cms?utm_source=whatsapp_pwa&utm_medium=social&utm_campaign=socialsharebuttons)
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవగాహనా రాహిత్యం, ప్రజల బాధ్యత లేని తనం ఇవన్నీ వెరసి ఈ దేశం లో వాళ్ళు చెబుతున్నట్టుగా బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజం చెయ్యడానే అన్నట్టు కోటి మంది టార్గెట్ ఏమో అని భయం గా ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం కి ఉదాహరణ గా జనవరి నెల నుండే కోవిడ్ 19 గురించిన హెచ్చరికలు ప్రపంచ వ్యాపితం గా వస్తున్నా కూడా నిన్న మొన్నటి వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసుల పైన ఆంక్షల దిశగా వెల్లకపోవడం చెబితే. కోవిడ్ లక్షణాలు కలిగి దేశీయ రైళ్లలో తిరిగేసిన ప్రజల భాద్యతలేని తనాన్ని చెప్పుకోవాలిసిన అవసరం ఉంది.
Ref: (https://m.timesofindia.com/india/rlys-at-least-12-coronavirus-infected-took-trains-in-4-days/articleshow/74754288.cms)
వ్యవస్థ ల డొల్లతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి బ్రతుకుల తో ఆడుకునే విధం గా చేసే నిర్బందం మాత్రమే కాకుండా ఈ నిర్బంద సమయం లో ప్రజా జీవితం disturb కాకుండా వారికి కలిపించే సదుపాయాల విషయం లో కూడా గుణాత్మక అభివృద్ధి సాధించాలిసిన అవసరం ఉంది.
జనతా లాక్ డౌన్ లో ప్రజల భాగస్వామ్యం సాధించే దిశగా చర్యలు ముమ్మరం చెయ్యాలి. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా నిర్మూలన - నియంత్రణ కి ప్రభుత్వం చిత్తశుద్ధి తో పని చెయ్యాలి. నిత్యావసర వస్తువుల లభ్యత విషయం లో వాటి బ్లాక్ మార్కెటింగ్ విషయం లో ప్రభుత్వాలు కఠినం గా వ్యవహరించాలి. ప్రవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో కరోనా పరీక్షలు ఉచితం గా చెయ్యాలి అని వారిపై వత్తిడి చెయ్యాలి. రోజువారీ చెయ్యాలిసిన కరోనా నిర్ధారణ పరీక్షల కు ప్రవేటు - ప్రభుత్వ ఆసుపత్రులకు టార్గెట్ విధించాలి. వైద్య, పారిశుధ్య మరియు అత్యవసర రంగాలలో పని చేస్తున్న వారి కి కనీస వ్యక్తిగత భద్రతా పరికరాలు సమకూర్చాలి.
చివరిగా పోలీసు సిబ్బంది మరియు వ్యవస్థ తో కరోనా ని ఎదుర్కోవడం మాని చాలా సీరియస్ గా వైద్య, పారిశుధ్య బృందాల తో మాత్రమే ఈ కరోనాని ఎదుర్కొన వలసిన అవసరం ఉంది అని గ్రహించాలి, సాధారణ ప్రజలని కరోనా వైరెస్ ని ఎదుర్కోవడం లో భాగస్వామ్యులని చెయ్యాలి తప్ప భాద్యులని చెయ్యడం వల్ల ప్రయోజనం ఉండదు.
- విశ్వనాధ్ జయంతి

No comments:
Post a Comment