మద్యనిషేదం సాద్యాసాద్యాలు:
ఇప్పుడు మద్యం విక్రయల్లో రికార్డులు సాధిస్తున్న రాష్ట్రాలు మద్యనిషేదం అమలు చేయాలి అంటే సాద్యమేనా? మన సమాజం లో మద్యనిషేదం ఆవస్యకత ఏమిటి?
సాద్యమా? సాద్యం కాదా? ఆంద్ర ప్రదేష్ వరకూ మద్యనిషేదం కీలక హామీల్లో ఒకటిగా ఉంది కాబట్టి అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్తితులు మద్యనిషేదం వైపుగా సాగుతున్నాయా? ఈ విషయాలు ఈ పోష్ట్ లో చూద్దాం!
అసలు మద్యనిషేదం ఆవస్యకత ఏంటి? పశ్చిమ దేశాల లో broad గా మద్యపానం అనేది కేవలం ఆరోగ్య పరమైన అంశం. కానీ మనదేశం లో ఇది సంక్లిష్టమైన సాంఘిక, ఆర్ధిక, ఆరొగ్య పరమైన అంశం.
మద్య పానం చేస్తే ఆరొగ్యం క్షీనించడం అనేది కామన్ ఆది అందరికీ తెలిసిన విషయం. మద్యపానం వల్ల గృహ హింస, వ్యక్తిగత హక్కులకి, మానవాహక్కులకి భంగం కలగడం లాంటివి మనదేశం లో చాలా విరివిగా మన దృష్టికి రావడం జరుగుతుంది.
మనదేశం లో ఆర్ధిక భద్రత ఉదాహరణకి పనికి తగిన ప్రతిఫలం విషయం లో పరిణితి చెందని సమాజం కాబట్టి, శ్రమ దోపిడీ అనేది ఒక సాధారణ విషయం కాబట్టి, వ్యక్తిగత ఆర్ధిక పరిస్తితుల్లో ప్రయారిటీ అనేది జీవన అవసరాల తరువాత లక్జరీ అనే కోణం లో ఈ అంశాన్ని కనుక చూస్తే, కుటుంబ ఆదాయం లో అధిక శాతం, లక్జరీ అయిన మద్యం పైన ఖర్చు చేయడం మన కుటుంబ ఆర్ధిక ఆరోగ్యాన్ని పాడు చేసే అంశం గా మనం చూడాలి.
ఎలా ఐయితే ఆదేశాల్లో ని వర్ణ వివక్ష మన కుల వివక్ష తో పోల్చలేమో ఇక్కడి complex evil అయిన మద్యపానాన్ని ఆదేశాల సమస్యతో పోల్చలేము.
1. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ complex evil ని హాండిల్ చెయ్యలి అంటే దానికి comprehensive solution కావాలి, అది సమస్య లాగానే, అంతే complexity ని కలిగి ఉంటుంది. మద్యనిషేదం సాధ్యమా కదా అని అడిగే సూటి ప్రశ్నకి 'కష్టసాద్యం' అనే జవాబు సరిపోతుంది.
నిజం గా మద్యనిషేదం చేయాలి అంటే ఆలోచన తో పాటుగా ప్రభుత్వం యొక్క నిబద్ధత కూడా చాలా అవసరం. మద్యనిషేదం చెయ్యాలి అంటే ఎలాంటి చర్యలు అవసరం అవుతాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.
A) ముందుగా మద్యనిషేదం చేయగానే వచ్చే మొదటి సమస్య ఇప్పటికే ఈ అలవాటుకు బానిసలు గా అయిపోయిన వ్యక్తులు. వీరు మొదటి బాధితులు, వీరిని గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఒక వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడా లేదా, అని గుర్తించడం మద్యం అందుబాటులో ఉన్నపుడే సాధ్యం అవుతుంది. మద్యం దొరినపుడు మద్యపానం చేసే ప్రతీ వ్యక్తి రోజు ఏ రకమైన మద్యాన్ని ఎంత quantity, ఎంత frequent గా సేవిస్తున్నా డన్న డేటా ప్రభుత్వం సంపాదించాలి. ఈ డేటా ఆధారం గా లెక్కలు కట్టి సివియారిటీ ఇండెక్స్ ని ప్రిపేర్ చేసి గ్రేడులుగా విభజించాలిసి ఉంటుంది. దానిని బట్టి ఏ ప్రాంతం లో ఎన్ని Deaddiction సెంటర్ లు, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారో అనే వివరాలు తెలుస్తాయి. అలాగే మద్యానికి బానిస అయిన వ్యక్తి అలవాటు యొక్క సివియారిటీ కూడా ప్రభుత్వం అర్థం చేసుకోగలుగుతుంది.
B) మద్యం నిషేదించే ప్రాసస్ లో రెండవ సవాలు, ఇంకా అనారోగ్య కరమైన చీపర్ ఆల్టర్నేటివ్స్ కి మద్యం యొక్క బానిసలు వెళ్లకుండా చూసే ప్రక్రియ. మత్తు కోసం చీపర్ మరియు డేంజరస్ అలెటర్నేటివ్స్ కి ప్రజలు వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగా మద్యం లాంటి మత్తు ని ఇచ్చే పదార్థాల ని లిస్ట్ ఔట్ చేసి వాటి లభ్యత పైన నిఘా పెట్టాలిసిన అవసరం ఉంది. లాక్డవున్ విధించినపుడు ఆహార పదార్థాల ఫర్మెంటేషన్ కోసం ఉపయోగించే yeast కొరత ఏర్పడడం మన లో చాలామందికి తెలియదు. ఇంట్లోనే మద్యం తయారు చెయ్యాలి అనే ప్రయత్నం లో భాగం గా ఇది జరిగింది అనేది ప్రభుత్వ నిఘా ఆధారం గా తేలింది. అలాగే అప్పట్లో మద్యం దొరకని కారణం గా కాఫ్ సిరప్ లు, పినాయిల్ లాంటి పదార్థాలు ప్రజలు ఆల్టర్నేటివ్ గా వినియోగించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పదార్థాల అమ్మకాల పైన నిఘా ఉంచాలి.
C) మద్యపాన నిషేధం వల్ల కలిగే మానసిక పరమైన రుగ్మతలు దృష్టి లో ఉంచుకుని వాటిని హాండిల్ చేసే విధం గా కౌన్సిలింగ్ చెయ్యడానికి withdrawal సింటమ్స్ ని వాటి వల్ల మనిషి చూపించే ప్రాబబిల్ లక్షణాలని వైద్య సిబ్బంది సహాయం తో అంచనా వేసి ఆ లిస్ట్ పై అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. ఒకవేళ ఇలాంటి లక్షణాల తో కుటుంబ సభ్యులు గాని, కమ్యూనిటీ లో ఉన్న కుటుంబేతర సభ్యులు గాని కనిపిస్తే రాపిడ్ ఏక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసి ఎం చెయ్యాలి అనే విషయం పైన అందరికీ అవగాహన కల్పించాలి. తగిన సిబ్బంది ని అందుబాటులో ఉంచాలి.
D) కనీసం మూడు నెలల పాటు వారం వారం రివ్యూ లు చేసి కొత్త సవాళ్ళు ఏమైనా వస్తే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి.
పైవిధం గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తో కనుక ప్రభుత్వాలు నిజాయితీగా ప్రయత్నిస్తే మద్యపాన నిషేధం సాధ్యం అవుతుంది.
2. మధ్య పాన నిషేధం చెయ్యకపోవడానికి మనకి కనిపించే సవాళ్ళను చూస్తే,
A) స్మగ్లింగ్: మద్యం ఒక రాష్ట్రంలో దొరకకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో విరివిగా దొరుకుతుంటే చాలా కామన్ గా ఎదురయ్యే సవాళ్ల లో ఒకటి మద్యం అక్రమ రవాణా. నిజం గా నిజాయితి తో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన పక్షం లో చాలా వరకూ ఈ స్మగ్లింగ్ ని ప్రభుత్వాలు అరికట్ట గలుగుతాయి. ఎలా అయితే ఇతర వస్తువుల స్మగింగ్ ని ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా అరికట్ట గలుగుతున్నాయో అలాగే మద్యం అక్రమ రవాణాని కూడా అరికట్టచ్చు. మద్యం స్మగ్లింగ్ కఠినమైన శిక్షలు, అధిక జరిమానాల కి కారణం అయ్యే విధం గా చట్టాలు చేస్తే వీటిని దాదాపు ఇప్పుడు ఉన్న వ్యవస్థ తోనే హాండిల్ చెయ్యచ్చు. పూర్తిగా స్మగ్లింగ్ ని ఆపలేక పోవచ్చు గాని ఈ విషయం లో గుణాత్మక మైన వృద్ధి సాధించచ్చు. పాలసీ ఇంప్లిమెంటేషన్ లో వందకి వందశాతం అవకాశం లేదు కాబట్టి లీగలైస్ చేస్తాం అనే వాదన లంచం నిర్మూల కావడం లేదు కాబట్టి లంచాన్నీ లీగల్ చెయ్యడం లాంటిది.
B) రాష్ట్ర ఆదాయానికి సంభందించిన సవాలు రెండో పెద్ద సవాలు. మన రాష్ట్రాలు మద్యం అమ్మకాల లో దేశవ్యాపితం గా రికార్డు స్థాయి లో వృద్ధి రేటు సాధించడం వల్ల ఆ ఆదాయం పైన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆధార పడి ఉన్నాయి అని వాటికి కేటాయింపులు చేయలేం అని ఒకవాదం మనకి విరివిగా వినబడుతుంది. ఇది కేవలం తాత్కాలికం గా ఉంటుందన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తాయి. మద్యం దొరకని పక్షం లో ఆ మిగిలిన డబ్బు వ్యక్తులు వేరే అవసరాల పైన ఖర్చు పెట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం stable అవడానికి 6 నెలల నుండీ ఒక సంవత్సరం టైమ్ పట్టచ్చు. కానీ ప్రభుత్వానికి టాక్స్ రూపం లో వచ్చే డబ్బు అనేది ఎక్కడికీ పోదు. మధ్య నిషేధం చేయాలన్న సంకల్పం తో దానికి కావలిసిన ఇన్ప్రాస్టక్చర్ సమకూర్చడం కోసం ప్రభుత్వం అధిక శాతం డబ్బు కేటాయించాలిసిన అవసరం మొదట్లో ఉన్నా కూడా, మద్యపాన నిషేధం వల్ల జరిగే క్రైమ్ రేట్ తరుగుదల, ప్రోడక్టివిటీ పెరగడం లాంటి వాటివల్ల లాంగ్ టర్మ్ లో ఇది ఇప్పటి నష్టానికి ఎన్నో రేట్ల ఎక్కువ లాభం చేకూర్చే అవకాశం ఉంది. రాష్ట్రం లో ప్రజారోగ్యానికి కల్పించే కేటాయింపుల్లో తగ్గుదల, ఆరోగ్యశ్రీ లాంటి పథకాల పైన ఖర్చు పెట్టె సాలీన ఖర్చు గణనీయం గా తగ్గే అవకాశాలు లేక పోయేవు.
3) ఒకవేళ ప్రభుత్వం రిస్క్ తీసుకునే ఉద్దేశ్యం లో లేకపోతే ఇప్పుడున్న పొలిసీ లో కొద్దిపాటి మార్పులు చేస్తూ రిస్క్ బెనిఫిట్ ని బాలేన్స్ చేసుకుంటూ గ్రాడ్యువల్ గా మద్యనిషేదం వైపు అడుగులు వెయ్యచ్చు.
A) ఇందులో మద్యం దుకాణాల లో మద్యం కొనే బాటిల్స్ మీద నియంత్రణ చెయ్యడం, అలాగే మద్యనిషేదానికి పనికొచ్చే విధం గా డేటా కలెక్ట్ చెయ్యడానికి ఆధార్ కార్డు లేదా వేరే యునీక్ వ్యవస్థని అభివృద్ధి చేసి రేషన్ పెట్టచ్చు. తద్వారా మనిషి ఎంత శాతం మద్యానికి బానిస అయ్యాడు అన్న డేటా ప్రభుత్వానికి తెలుస్తుంది.
B) అలవాటు పడిన బ్రాన్డ్స్ అందుబాటులో లేకుండా చేసి వేరే కొత్త బ్రాన్డ్స్ ని మార్కెట్ లోకి తీసుకుని వచ్చి మందుతాగే అలవాటుని discourage చెయ్యలి. అదే విధం గా ప్రతీ నెలా ఈ బ్రాండ్ ల మార్పులు చేసి. రుచి పరంగా విముఖులని చెయ్యాలి, దానితో పాటు అవగాహన, కౌన్సిలింగ్, డి ఎడిక్షన్ అనే 3 అంచెల పద్ధతిని పాటించాలి.
C) కార్డు పైన మద్యం కొనుగోలు చేస్తున్న ప్రతీ ఒక్కరూ నెలలో రెండు సార్లు ఈ అవగాహన కార్యక్రమాలకు హాజరు అయ్యేలా చేసి ఒకవేళ అక్కడ అటెండెన్స్ లేకపోతే మద్యం దొరకని విధం గా చర్యలు చేపట్టాలి.
D) ప్రతీ ఆరునెలలకి వ్యక్తియొక్క లెవల్ ని ( మూడు అంచలలో ఏ లెవల్ లో ఉన్నదీ) పరిశీలించి ప్రొగ్రస్ లేని వ్యక్తులకు మద్యం రేషన్ తగ్గించాలీ. ఇలాంటి constructive విధానం కనుక ప్రభుత్వం అమలు చేయగలిగితే ఒక సర్టెన్ పీరియడ్ లో మద్యపాన నిషేధం సాధ్యమే.
ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మద్యనిషేదం దిశగా అడుగులు వేస్తోందా లేదా అనేది పైన చెప్పిన చర్యల అమలు జరుగుతున్నాయా లేదా అనే బేరీజు చేసుకుంటే చాలా ఈసీ గా అర్థం అవుతుంది.
- విశ్వనాధ్ జయంతి
No comments:
Post a Comment