ట్రావెంకోర్ ఇటీవలనే తనపరిధి లో ఉన్న కొన్ని ఆలయాలలో దళిత పూజారులని నియమించాలి అని నిర్ణయం తీసుకుంది. మానవవాదులులుగా, ప్రజాస్వామ్యవాదులుగా ఈ చర్యను హర్షించవలసిన సంధర్భం ఇది. మనం హర్షించవలసిన కారణం ఎందుకంటే ఒకటి, వారు దళితులకు పూజారులుగా అవకాశం ఇవ్వడం మొదలుపెట్టినందువల్ల. రెండు, హిందూ మతం లో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మతచాందస అడ్డు గోడల ని కూల్చి తీసుకున్న నిర్ణయం కావడం వల్ల. Yes, we must appreciate if this move viewed as a only symbolic gesture towards eradicating caste discrimination.
కానీ ఇదే పరిష్కారమా? అసలు సమస్య ఉద్యోగమేనా లేదా ఈ ఒకే అంశానికి పరిమితమైనదా? భారతదేశంలో అస్పృస్యత అసమానత్వం అనేది విసృతమైన పరిధిని కలిగిఉన్నది అని చెప్పనవసరం లేదు.
నాకైతే హిందూ సమాజం పైన, లావాలా దళిత వర్గాల లో ఉబికి వస్తున్న unrest ని చల్లార్చే తాత్కాలిక పైలేపనం గా ఈ చర్య ఉందని అనుమానం కలుగుతోంది.
Dr BR Ambedkar కోరుకున్నది ఇదేనా? ఆయన ఒక ఇంటర్యూ లో - Mr. Gandhi భారత సమాజాన్ని ముఖ్యం గా మూడు ప్రధాన వర్గాలుగా విభజించారు. హిందు, ముస్లిం మరియు సిఖ్. ఇవి కాని వర్గాలు ఈ మూడిటి లోనికి రాని వర్గాలు ఇందులో ఏదో ఒక వర్గం లో విలీనం అవ్వవలసి ఉంటుంది అని సూచించారు. కానీ Dr BR Ambedkar ఎన్నడూ కూడా షెడ్యూల్డ్ వర్గాలని హిందూ సమాజం లో భాగం గా చూడలేదు. వారికి ప్రత్యక గుర్తింపు ఉన్నది అని నమ్మారు.
అందుకే షెడ్యుల్ వర్గాల ఆలయ ప్రవేశం గురించి అయన అంత సీరియస్ గా తీసుకోలేదు.
Dr Ambedkar షెడ్యుల్ వర్గాలకు భారతదేశం యొక్క అన్ని ప్రభావవంతమైన institution లలో strategic పొసిషన్ లలో స్తానం ఉండాలి. తద్వారా సమాజిక అసమానతలను రూపుమాపే దిశగా బాటలు వెయ్యబడతాయి అని భావించారు. ఈ కోణం లో చూసినా పూజారి అనే స్తానం హిందూ మతం లో ప్రస్తుత కాలమాన పరిస్తితులలో strategic పొజిషన్ కాదు. హిందూ మతం ఇప్పుడు మోడరన్ స్వామీజీల మరియు మోడరన్ సన్యాసుల చేతిలోఉంది.
నాకైతే పూజారులుగా కొంతమంది ని రికృట్ చెయ్యడం ద్వారా ఈ చర్య హిందూ మతాన్ని మరింత బలోపేతం చెయ్యడానికి దోహదం అవుతుందే తప్ప ఇందులో దళితులకి వొరిగేది ఏమీ ఉండదు అని అనిపిస్తున్నది.
As per my understanding equality means giving equal opportunity to share the table during the time while taking decisions, it’s doesn't mean only giving equal opportunity in implementing the decisions.
అందుచేత కొంచం అలొచన కలిగిన బుద్ది జీవులందరూ సంబరాల ప్రచారాలని ఆపి దీని వెనుక ఉన్న అంతర్యాలని అర్థం చేసుకో గలరు అని ఆశిస్తున్నా!
-- Viswanadh Jayanthi
No comments:
Post a Comment