తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వడివడిగా నగదు బదిలీ పధకం వైపుగా అడుగులు వేస్తున్నట్టు గా కనిపిస్తోంది. ముందుగా వృద్దప్య, వికలాంగ, వితంతు ఫెన్షన్లు ప్రజలకు అలవాటు చేసి అదే విధంగా చిన్న వేలిముద్రతో నిత్యావసర వస్తువుల పంపిణీ లేదా ప్రజాపంపిణీ వ్యవస్తలకు వస్తువులకు బదులుగా నగదును బ్యాంక్ అకవుంట్ల లో జమచేసేటందుకు సన్నాహాలు ప్రారంభించాయి.
తప్పేముంది బియ్యం, పంచదార, కిరోసిన్లకి మొదలైన వస్తువులకు బదులుగా వాటికి సరిపడ డబ్బులు ప్రజల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా చేరిపోతే ఆ మొత్తం తో వినియోగ దారుడు తనకు నచ్చిన వవస్తువులను అంగడిలో నుండి కొనుక్కునే వీలుంటుంది కదా! అని మనకి అనిపించవచ్చు.
చాలా మంది మద్య తరగతి ప్రజలు రేషన్ లో వచ్చిన బియ్యం మొదలైన వస్తువులు మార్కెట్ లో అమ్మడమో లేదా వాటిని మరొకలాగ వినియోగించడమో జరుగుతోంది అని ప్రభుత్వం చెబుతోంది. దీనికి కారణం ఇచ్చే బియ్యం మొదలైన ఆహార వస్తువుల్లో నాణ్యత లోపించడంగా చెబుతున్నారు. ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితం ఐన సర్వే ప్రకారం తెలంగాణాలో దాదాపు 50% మంది ప్రజలు రేషన్ బియ్యాన్ని వాడడం లేదు. మరోవైపు రేషన్ దుకాణాలు అక్రమ అమ్మకాలు, అవినీతికి ఆలవాలం గా మారాయి దీనిని అరికట్ట వలసిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది అని ప్రభుత్వాలు వాబోతున్నాయి. అందువలన దీనికి ప్రత్యామ్నయం గా నగదును నేరుగా లబ్దిదారులకి ఇస్తే అది ఉపయోగకరం గా వుంటుంది అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఇక ఈ నిర్ణయం యొక్క మూలాల లోనికి పోతే WTO మరియు word bank agreements ప్రకారం food security పథకాలు ప్రభుత్వాలు నిర్వహించకూడదు, ఒకవేళ ఇప్పటికే నిర్వహిస్తున్నట్టయితే క్రమం గా వాటిని ఉపసంహరించుకోవాలి. ఇలాంటి ప్రయత్నమే TRS ప్రభుత్వం తెలంగాణాలో అధికారం లోకి వచ్చిన కొత్తలో చేయడం ప్రజల్లో వ్యతిరేఖత రావడం చూసి ఉపసంహరించుకోవడం జరిగింది. స్కూల్ పిల్లలకు మధాహ్న భొజన సౌకర్యం కలిగిస్తున్నందున లబ్ధిదారులకు ఇచ్చే రేషన్ లో ఆమేరకు కోత విధించే ప్రయత్నం చేసి మళ్ళి దాన్ని పునరుద్దరించడం మనం చూసాం. అలాగే TRS ప్రభుత్వం లో ఉన్న మంత్రులు తరచుగా జనాభాలెక్కల ప్రకారం ఉన్న కుటుంబాల లెక్క కన్న రేషన్ కార్డ్ లు ఎక్కువ ఉన్నవి అన్న వాదనలు మీడియాలో వినిపించడం కూడా చూసాం.
ఇప్పుడు రేషన్ కి తగ్గ నగదును జమ చేస్తాం అని రేషన్ షాప్ ల నిర్వహన లో ఉన్న అవకతవకలు నిర్మూలించడానికి ఇదే సరిఅయిన మార్గం అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది.
ఇది నిజమైన ప్రయామ్న్యాయమేనా అని ఒక్క సారి మూలాల్లోకి వెల్తే కాదు అనేది స్పష్టం గా తెలుస్తోంది. రేషన్ బియ్యం లో ఉన్న నాణ్యతా లోపాలవలన ప్రజలు వాటిని దేనికోసం ఇస్తున్నామో దానికి వినియోగించడం లేదు అన్న ప్రశ్నకి జవాబుదారి ప్రభుత్వం మాత్రమే. ప్రజలకు వాళ్ళు తినాలి అనుకుంటున్న సన్న బియ్యం ను ప్రభుత్వమే ఇవ్వవలసి ఉంటుంది. వ్యవస్త లో ని లోపాల ను సవరించే భాద్యత ప్రభుత్వానిదే!
ఒకవేళ food security కొరకు నగదును బదిలీ చేస్తే అది conspicuous consumption కు దారితీయదు అని మనం ఎలా చెప్పగలం. భారతదేశం లాంటి పురుషాధిక్య సమాజం లో భార్య పిల్లల మందులకొరకు దాచుకున్నడబ్బులని భర్త మద్యం కొరకు బలవంతంగా లాక్కొని వెళ్ళడం వల్ల సారా వ్యతిరేఖ ఉద్యమం మొదలైన చరిత్ర మనకు సుపరిచితమే.
సరే జనాభా మొత్తం గా రేషన్ వాడడం లేదు వాళ్ళకి అవసరం లేదు నగదు ఇస్తే వారి మిగిలిన అవసరాలు తీరతాయి అనుకుందాం. దీనికి మనం రీసెంట్ డేటా రిపొర్ట్స్ ని పరిశీలించ వలసిన అవస్యకత ఉన్నది. మొన్నటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత దేశం యొక్క స్థానం 119 దేశాలలో 100. మనం అత్యంత వెనుకబడిన దేశాలుగా బావిస్తున్న దేశాలు కూడా మనదేశం కన్నా ముందున్నాయి అన్న విషయం మనం ఇక్కడ చెప్పుకోవలసిన అవసరం ఉంటుంది. భారత ప్రభుత్వమే ప్రకటించిన డేటా మరియు world health organisation డేటాలను పరిశీలిస్తే ఈనాటికీ infant mortality మన దేశాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యలలో ఒకటి. దీనికి తల్లి బిడ్డల పౌష్టికాహార లోపం ఒక విస్పష్టమైన కారణం. పసిపిల్లలలో మాల్ న్యుట్రిషన్ అనేది తల్లి నుట్రిషనల్ ఇంటేక్ మీద ఆధారపడి ఉంటుంది అన్న సంగతి ప్రత్యేకం గా చెప్పవలసిన అవసరం లేదు. ఈనాటికీ under weight గా పుట్టే పిల్లల సంఖ్య దాదాపు clinically normal born child సంఖ్య తో సమానం గా ఉండడం దేశం యొక్క పరిస్తితిని అద్దం పడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచం లో food security కొరకు నగదును అమలుచేసిన దేశాల success రేట్ ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలిసిన అవసరం ఉంది.
Food security issues కొంచం పక్కన పెట్టి పౌరసరఫరా వ్యవస్థ పైన ఈ నగదు బదిలీ యొక్క ప్రభావం చూద్దాం! రైతులు పండించిన ధాన్యాలను నేటికీ FCI ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఎక్కవ శాతం కొనడం జరుగుతోంది. ధాన్యం గ్రేడు, విపత్తులలో దెబ్బతిని quality పడిపోయిన ధాన్యం మొదలైన విషయాలు పక్కన పెట్టి మేలైన సరుకు విషయమే మాట్లాడుకున్నా రైతు దగ్గర కొన్న ధాన్యం FCI పౌర సరఫరా వ్యవస్థ ద్వారానే చాలావరకు వినిమయం జరుగుతోంది. అలాంటప్పుడు పౌరసరఫరా వ్యవస్థ ని నిర్వీయం చేసినట్టైతే FCI కి కొని నిల్వవుంచడం సమస్యనే అవుతుంది. వ్యాపారస్తు లకు ఎక్కడ తక్కువ ధరకి దొరికితె అక్కడే కొనుక్కునే వెసులుబాటు ఉండడం వల్ల తక్కువ ధరలకే ధాన్యాన్ని అమ్మే చైనా మొదలైన దేశాల నుండీ దిగుమతికి ఆసక్తి చూపుతారే తప్ప రైతుని ఆదుకుందాం అన్న భావన వారికి ఉండదు. అప్పుడు మద్దతు ధర అనేది అతిపెద్ద సమస్యగా తయరవుతుంది. ఇప్పటికే లాభసాటిగా వ్యవసాయం నడవక ఆత్మహత్యలు చితికి చేసుకుంటున్న పరిస్తితి భారతదేశం లో ఉంది. ప్రభుత్వం నుండీ ఆమాత్రం కొనుగోలు లేకపోతే రైతు పరిస్తితి అత్యంత దయనీయం గా మారుతుంది అనడం లో అతిశయోక్తి లేదు.
కాబట్టి food security విషయాన్ని, ప్రజా పంపిణీ వ్యవస్తను ప్రభుత్వాలు socioeconomic కోణం లో చూడాలిసిన అవసరం ఉంది.
- Viswanadh Jayanthi

No comments:
Post a Comment