Monday, 6 November 2017

Freedom of speech is a responsibility, yes! It's State's Responsibility.

దాదాపు 40% ప్రజలు నిరక్షరాస్యులు గా ఉన్న, చదువు ఉద్యోగం కోసమే అని చదువు వల్ల వచ్చిన జ్ఞానాన్ని దైనందిత జీవితం లో వాడని, వాడలేని నిస్సహాయ స్థితి మన దేశ ప్రజల సొంతం.

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బోలాయ్ గ్రామంలో రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న అంజనేయ గుడి దగ్గర స్టాప్ లేకపోయినా ఆ దారిలో పోయే ప్రతీ రైలూ ఆగుతుంది. అలా ఆగగక పోతే ప్రమాదం జరుగుతుంది అని నమ్మిక. ఇంట్లో కొత్త కంప్యూటర్ కొన్నా కూడా దానికి హారతిచ్చి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టకుండా స్విచ్ ని ఆన్ చెయ్యని, అంగారకుని మీదకు పంపే రాకెట్ మోడల్ ని దేవుని పాదాల దగ్గర పెడితేనే మిషన్ సక్సెస్ అవుతుంది అని అనుకునే వారు ఉన్న దేశంలో ఉన్నాం.

చైనా తో ఆర్ధిక యుద్దానికి సిద్ధం కండి, ఆ దేశం లో తయారయ్యే ఏ వస్తువును కొనద్దు అని పిలుపుని అందుకుని ఈ దీపావళి కి  'తుస్' మని ఆరిపోతున్నా made in india బాణా సంచానే కొని కార్గిల్ పుంచ్ ల లో మనమే యుద్ధం చేస్తున్న ఊహాల్లొ తేలిపోయే జనం, బ్లాక్ మనీ వెలికితీస్తా అని దేశం మొత్తాన్ని రోడ్లమీద లైన్లలో నిలబెట్టి నా కిక్కురు మనని నైజం ఉన్న జనం మధ్య లో ఉన్నాం.

ఇలాంటి జనానికి భావ ప్రకటనా స్వేచ్ఛ విలువ తెలిసే అవకాశం ఉంది అని అనుకోవడం అత్యాశ నే అవుంతుంది. ఈ మంద లోనే పెరిగి బయటకు వచ్చి కొంతమంది సెలెబ్రేటీలలో ఒకరు మన అనుపం ఖేర్ గారు. ఆయన ఒక ఇంటర్వ్యు అంటారు freedom of speach  is a responsibility అన్నారు, అరె ఎంత గొప్పగా చెప్పారు అని అనుకునే లోపే ఏ రోడ్డు మీద టాయిలెట్ పోసి ఫ్రీడం అంటే కుదురుతుందా అనేశారు. అంటే ఆయనకి ఆవేశమేకానీ అవగాహన లేదు అని అర్థం అయ్యింది.

రాజ్యాంగం లో చెప్పిన freedom of speech అండ్ expression అంటే ఏమిటీ రాజ్యాంగ మూలసూత్రాలు ఆంటే ఏమిటి, దాని పరిధులు ఏమిటి అన్న అవగాహన ప్రతీ ఒక్కరికీ ఉండాలిసిన అవసరం ఉంది.

- security of the State
- ‎friendly relations with foreign States,
- ‎public order,
- ‎decency and morality,
- ‎contempt of court,
- ‎defamation,
- ‎incitement to an offence, and
- ‎sovereignty and integrity of India.

రాజ్యాంగం ని అనుసరించి పై సందర్భాలలో తప్ప ప్రతీ ఈ దేశం లో ఉన్న ప్రతీ భారత పౌరునికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది.
కానీ ఈరోజు పరిస్థితి దానికి అనుకూలం గా లేదు అని చెప్పడానికి పెద్దగా ఆలోచించాలిసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను.

నిన్నటికి నిన్న కార్టూనిస్ట్ బాల అరెస్టు నేను అలాభావించడాని కి గల కారణాలలో ఒకానొక మచ్చు తునక. ఈ దేశం లో ఆపార్టీ ఈపార్టీ అని తేడాలేకుండా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వారివారి స్థాయిలలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ని అణచడం జరిగింది వారి అవసరం మేరకు చట్టాన్ని అడ్డుగా పెట్టుకొని , చట్టపరం గా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాబ్ మేనేజ్మెంట్ ద్వారా చట్టవ్యతిరేకమైన కార్యక్రమాల ద్వారా స్వేచ్ఛ ని అణచివేసే ప్రయత్నం బహిరంగంగా గానే జరుగుతొంది.

చివరిగా ఒక సమాజం సాంస్కృతిక పరం గా, సామాజిక పరం గా పరిఢవిల్లాలి అంటే ఓకే అంశంపై భిన్న మైన అభిప్రాయాలు ఉన్న సమూహాలు ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని నా అభిప్రాయం. ఆ రోజు గెలీలియో చర్చి ఆలోచనాలకి భావాలకి భిన్నమ్ గా ఆలోచించి నందు వల్లనే ఈరోజు విజ్ఞాన శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందిది అని చెప్పడం అతిశయోక్తి కాదు. కాబట్టి ఆలోచించగలిగిన ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ పరం గా మనం కలిగి ఉన్న హక్కులను సాధించుకోవడానికి పోరాటం చెయ్యాలిసిన అవసరం ఉందని, ఒకవేళ హక్కులకు ఎక్కడైనా విఘాతం కలిగితే గళం విప్పడానికి సంకోచకూడదని నా అభిప్రాయం.

No comments:

Post a Comment

Tips to make online education more utilitarian

  Tips to make online education more utilitarian 1.     Serious Learning Approach:   When you are attending online classes, you need m...