Monday, 3 August 2020

NEP 2020

NEP - 2020 / నూతన విద్యా విధానం 2020:

ఈ రోజు దేశవ్యాపితం గా New Education Policy గురించిన చర్చ జరుగుతోంది. కోవిడ్ నేపద్యం లో ఈ విద్యా సంవత్సరం గురించి అవలంబించాలిసిన సమగ్ర మైన విధానం కోసం దేశం లో విద్యార్ధులు, తల్లితండ్రులు, ఉపాద్యాయులు, విద్యాసంస్థలు ఎదురుచుస్తున్నాయి. ఈ సమయం లో ఆ విషయాన్ని పక్కన పెట్టి నూతన విద్యావిధానాన్ని కేంద్రప్రభుత్వం అమోదించడం అందరిని ఆశ్చర్యానికి గురిచెసింది అనడం లో అతిశయోక్తి లేదు. 

ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఆమోదించిన ఈ కొత్త విద్యా విధానం లో చాలా విప్లవాత్మక అంశాలే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వాటిలో ముఖ్యం గా ...

1.  Extension of right to education Act 2009: కొత్తపోలసీ ప్రకారం నిర్భంధ ఉచిత విద్యా హక్కు యొక్క ప్రారంభ వయసు 3 years - 18 years గా నిర్ణయించారు. అంతకు ముందు ఇది 5 years - 18 years గా ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగ లో కూడా నర్సరీ, ప్రీ - పైమరీ విద్య అందుబటులోకి రానుంది. 

ఇంతకు ముందు అంగన్ వాడీ కేంద్రాలు ఈ రకమైన భాద్యతని నిర్వహించేది. కానీ ఒక సమగ్రమైన సిలబస్ లేకపోవడం ఈ రకమైన కేంద్రాలు తక్కువ గా ఉండడం లోపాలు గా ఉన్నాయి. 

2. ఇప్పుడున్న 10+2 structure, స్థానం లో 5+3+3+4 గా వర్గీకరణ ఉండబోతోంది. అభివృద్ది చెందిన దేశాల వర్గీకరణ తో ఇది మ్యాచ్ అవుతుంది.  
(A) foundational Stage (B) Preparatory Stage (C) Middle Stage (D)Secondary Stage లుగా వీటిని పేర్కొననున్నారు. 

నిజానికి ఇప్పటికే ఈ విభజన అనేది సాంకేతికం గా ఉంది. 1) ప్రాధమిక 2) మాద్యమిక 3)ఉన్నత పాఠశాలలు మరియు 4) Inter College లు మనం చూస్తున్నాం. మార్పు అనేది కేవలం Structural change కి మాత్రమే పరిమితం ఐతే ఇప్పుడు ఉన్న దానికి ఇప్పటికి పెద్దతేడా కనిపించదు సిలబస్ లో సమగ్రమైన మార్పు కనుక వచ్చిన ప్పుడు మాత్రమే ఇది ఉపయోగ కరం గా ఉంటుంది. స్కూల్ స్తాయిలోనే కోడింగ్ లో శిక్షణ అనే లాంటి పాపులిస్టిక్ ఐడియాలని చెప్పడం కన్నా, విద్యార్ది యొక్క మానసిక, శారీరక సమగ్ర వికాసానికి తోడ్పడే లాంటి ఒక Holistic మెథడాలజీ రూపొంది, తదనుగుణం గా learning objectives ని నిర్దేసించుకుంటే రేపటి AI ( artificial intelligence ) తరం ఎలాంటి skill ని ఐనా తొందరగా adopt చేసుకునే విధం గా తయరవుతుంది. 

3. Examination system లో వినూత్నమైన మార్పులు రానున్నట్టు గా, విద్యార్ధి overall performance ని దృష్టి లో ఉంచుకుని knowledge మరియు core competencies యొక్క assessment జరగబోతోంది అని ఈ పోలసీ సంకేతాలు ఇస్తోంది. ఇది ఖచ్చితం గా ఆహ్వానిచదగిన అంశం. Progress Report Card విషయం లో కూడా రాబోయే మార్పులు అసక్తికరం గా ఉన్నాయి. విద్యార్ధి self-assessment అనే కాసెప్ట్ ని introduce చెయ్యడం అనేది progressive development అని చెప్పవచ్చు. 

4. vocational Education అనేది ఇప్పటికే ఉన్నా కూడా అది mainstream education కి Parallel గా ఉంది కానీ, విద్యలో భాగం గా serious subject  గా లేదు. ఇలాంటి మార్పు మన విద్యా వ్యవస్థలో ఎప్పుడో జరగాలిసినది. 

5. 1 - 5 వ తరగతి వరకూ మాతృ భాషా మాద్యమం లోనే విద్యా బోధన జరగాలి అని వీలైతే 8 వ తరగతి వరకూ extend చెయ్యలని సూచన చేస్తోంది. విద్యార్ది తొలి స్కూల్ లో మాతృభాష మాద్యమం లో కనుక విద్యార్ధి  చదువు మొదలయితే, విద్యార్ధి మానసిక వికాసానికి దోహదపడుతుంది అని, సృజనాత్మకత, అంశాల పట్ల పరిణితి మొదలైన వాటిలో ఎక్కువ ప్రగతి ఉంటుందని పలు అంతర్జాతీయ అద్యయనాలు చెప్తున్నాయి. అలాగే ప్రపంచ భాష అయిన ఇంగ్లీష్ మీడియం యొక్క పునాది మొదటినుండీ ఉంటే అది ప్రపంచ స్తాయి విద్యాభ్యాసానికి బీజం గా ఉపయోగ పడుతుంది అని రెండురకాల వాదనలు ఉన్నాయి. ఈ అంశల రీత్యా where ever it possible అనే దృక్పధం తో మాతృభాషా మాద్యమాన్ని ప్రొమోట్ చెయ్యడం ఈ NEP2020 విధానం గా ఉంది. స్కూల్ స్తాయిలో బోధనా మాద్యమాన్ని ఎన్నిక చెసుకునే వెసులుబాటు ఉండడం ఈ NEP2020 ప్రత్యేకత. 

6. మాద్యమిక స్తాయిలో నచ్చిన subject ని ఎంచుకుని ఎలాంటి కాంబినేషన్ లో అయినా చదువుకునే అవకాశం ఉండడం, విద్యార్ధి అభిరుచికి అనుగుణం గా చదువుకోగలగడం విద్యార్ధికి ఉపయొగ పడే అంశం. 

7. UGC, NAAC మొదలైన అన్నిరకాల Educational boards ఒకే గొడుగు కిందకి రానున్నాయి, NCERT సిలబస్ ని తయరు చేయనున్నది. 

9. ఇప్పుడు విద్యార్థులు గ్రాడ్యుయేషన్ 3 సంవత్సరాల తో పాటు 1 సంవత్సరం హన్స్(రీసెర్చ్) కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటి ప్రవేట్ యూనివర్సిటీ లలో కొన్ని ఈ లాంటి సౌకర్యం ఇప్పటికే ఉంది. 

10. ఇక పైన GDP లో 6% మొత్తాన్ని విద్య పైన ఖర్చు చెయ్యాలని పాలసీ చెప్తోంది. ఇప్పడు కేవలం సాలీనా సుమారు 3% మాత్రమే ఖర్చు జరుగుతోంది. 

లోపాలు: 
1. విద్యా విధానం ఒక సెంట్రలైజ్డ్ స్ట్రక్చర్ కాబోతోంది. సిలబస్, నిధుల బట్వాడా, ఎక్సమినేషన్ & అస్స్మెంట్ అనేది కేవలం ఒకే విధం గా నిర్వహించడం జరుగుతుంది. మన దేశం లాంటి multicultural, multilingual రాష్టాల్లో ఈ విధానం సత్ఫలితాలని ఇవ్వక పోవచ్చు. ఎందుకంటే మన దేశం లో రాష్టాల వారిగా ప్రాంతాల వారిగా వారి వారి అవసరాలు, వారి వారి అవకాశాలు బిన్నం గా ఉంటాయి. 

2. సిలబస్ విషయం లో అధికారం లో ఉన్న ప్రభుత్వాలు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కోవిడ్ నేపథ్యం లో జరిగిన సిలబస్ కుధింపులో డేమోక్రసీ, సెక్యులరిజం మొదలైన అంశాల్ని సిలబస్ లోనుండీ తీసి వేయడం ఇప్పటికే పలు అనుమానాలకు తావు నిస్తోంది. ఒకవేళ కేంధ్ర ప్రభుత్వం తలుచుకుంటే తన ఎజండాని, సిలబస్ లో జొప్పించే అవకాశం ఉంది. 

3. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం లో వాటిని పెంపొందించుకునే విషయం లో కొత్త పాలసీ అమలు అనేది ప్రస్తుత పరిస్థితి కి చాలా దూరం లో ఉంది. 

4. జీడీపీ లో 6% ఖర్చు చేయాలన్న ప్రతిపాదనలు ఇంతకు ముందు ఉన్న పోలసీల లో కూడా పొందుపరచబడి ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ మనదేశం లో అమలు చెయ్యడం సాధ్యం కాలేదు. ఇప్పటి ఆర్ధిక ప్రగతిని దృష్టిలో పెట్టుకుంటే, పూర్తి నిబద్ధత తో పని చేస్తే తప్ప పాత పరిస్థితి మరలా పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

5. బోధనా మాధ్యమం విషయం లో అనేక అనుమానాలు, అమలు చెయ్యడం లో అనేక సవాళ్లు ఉన్నాయి. ఈరోజు ప్రవేట్ - ప్రభుత్వ రంగాల భాగస్వామ్యమ్ దాదాపు 50 : 50 శాతం గా ఉన్నాయి. ( 2011 లెక్కల ప్రకారం 5 : 7 ), అంటే ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గి ప్రవేటు భాగస్వామం పెరుగుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఉపాధి అవకాశాల కోసం ఆరాట పడే సగటు పౌరులు వారి పిల్లలని మాతృ భాషా మాధ్యమం లో జెర్పించే అందుకు విముఖత గా ఉంటారు కాబట్టి. ఇప్పటిలాగే ప్రవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఛాయిస్ గా మరింత వేగం గా తన భాగస్వామ్యం పెంచుకునే అవకాశం ఉంది. అదే విధం గా ప్రభుత్వ పాఠ శాలలు కొన్ని సంవత్సరాల లోనే మూత బడే అవకాశం ఉంది. 

- విశ్వనాధ్ జయంతి.
fb.me/satyagrahi.blogger

No comments:

Post a Comment

Tips to make online education more utilitarian

  Tips to make online education more utilitarian 1.     Serious Learning Approach:   When you are attending online classes, you need m...