ఈ మద్య ఎక్కువగా inrernet లో వైరల్ గా హల్చల్ చేస్తున్న ఒక గుడ్డి పోష్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
అప్పట్లో శ్రీమతి ఇందిరాగాంధి ప్రధానిగా ఉన్న సమయం లో దేశం లో ఎలాంటి చాలెంజ్ ఎదురైనా ఇది పొరుగుదేశాల కుట్ర అనేవారట! మన ముఖ్యమంత్రి శ్రీ KCR గారు ఉద్యమ సమయంలో ప్రతీ విషయానికీ దీనికి కారణం తరతరాల ఆంద్రొళ్ళ దోపిడీ అని, ఇప్పుడేమో ప్రతీ చిన్న విషయానికి ఇది గత ఆంద్రా పాలకుల నిర్వాకం అని నమ్మ బలకడం సర్వ సాధారణం. పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రి శ్రీ నాయుడుగారు తక్కువేమీ కాదు, ప్రతీ విషయానికి ఇది ప్రతిపక్షం చేస్తున్న కుట్ర అని మొహమాటం ఏమాత్రం లేకుండా చెప్పేస్తున్నారు. నిజానిజాలు కొంచం విషయం పైన శ్రద్దపెట్టి చూస్తే కానీ అర్థం అవ్వవు.
ఇలాగే మన కమ్యునిష్ట్ పార్టీ కామ్రేడ్ లు కూడా యధాశక్తి పెప్సి, కోల, లీవర్ మొదలైన అమెరికన్ పెట్టుబడి దారీ భూర్జువా కంపనీల ఉత్పర్తులని వాడొద్దని పిలుపునిస్తునటారు.
ఇలాంటిదే ఈ మద్య RSS మోహన్ భగవత్ ఒక పిలుపుని ఇచ్చారు, అదేంటంటే చైనా ఉత్పర్తులని భారత పౌరులందరూ boycott చెయ్యాలి, మనం కొనే ప్రతీ చైనా వస్తువు పైన వచ్చిన ప్రతీ పైసా పాకిస్తాన్ కి ఆదేశం సహాయం గా యిస్తొంది అని, పాకిస్తాన్ ఆడబ్బుని తీవ్రవాదన్ని ప్రొత్సహించి భారతదేశం లో అశాంతిని నెలకొల్పడానికి వాడుతోంది అని పాపం ఆయన గుడ్డి వాదన.
ఇలాంటి ప్రచారాలు మన దృష్టికి వచ్చినపుడు మనం నిజానిజాల గురించి అలోచించే విచక్షణ కోల్పోయి నరాలనిండా పేట్రియాటిజం నింపుకొని అందరితో పాటు ఆయా ప్రచారాలని ఇంకో స్తాయికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం.
అసలు చైనా మన మీద ఆధారపడి ఉందా? చైనా ఎగుమతుల్లో మన వాటా ఎంత. మనం ఒకవెళ చైనా ఉత్పర్తులని దిగుమతి చేసుకోపోతే చైనా ఆర్ధిక వ్యవస్థ ఎంతవరకూ దెబ్బతింటుంది, దానికి మన దేశం ఎంతవరకూ సిద్దం గా ఉంది? trade agreements ఎంచెప్తున్నాయి? దిగుమతులను మనం ఆపితే మన ఎగుమతుల సంగతి ఏంటి?
చైనా మొత్తం ఎగుమతులు, 2.4T$ ఉండగా అందులో ఎక్కువ శాతం USA, HONG-KONG, Japan, Germany లకు ఉన్నాయి. ఇండియాకు చైనా చేసే మొత్తం ఎగుమతులు కేవలం 2.5% మాత్రమే. ఒక వేళ మనం దేశభక్తి చూపించి చైనా వస్తువులకి మనం No చెప్పినా చైనాకి ఒరిగే నష్టం ఏం ఉండదు.
ఇక పోతె చైనా మీద మనదేశం ఎంత ఆధార పడిఉందో చూద్దాం. ఇండియా కి చైనా 4 వ అతిపెద్ద export partner. హాంగ్ కాంగ్ 3 వ అతిపెద్ద export partner. కాబట్టి మన ప్రభుద్దుల మాటలువిని trade విషయం చైనాతో సున్నం పెట్టుకుంటే ఇండియాకే నష్టం.
- Viswanadh Jayanthi
No comments:
Post a Comment