కంచ ఐలయ్యని చంపుతాం అని బెదిరించడం అత్యంత అమానవీయ చర్య . సిద్దాంత వైరుద్యాలకి హత్యలు సమాధానం కాదు.
నిజానికి కంచ ఐలయ్య తన రచన ద్వారా లేవనెత్తిన కొన్ని మౌలికమైనన అంశాలపైన చర్చ జరిగి ఉండవలసి ఉన్నది. అలా కాక ఆయన ఇచ్చిన సూత్రీ కరణ మరియు ఉపయోగించిన పదజాలం మీద చర్చ జరగడం బాధాకరం
కంచ ఐలయ్య రాసిన పుస్తకం లో ఆయన లేవనెత్తిన అంశాలు పై కాక ఆయన దానికి సపోర్టివ్ గా చేసిన అత్యంత సాధారణ సూత్రీకరణలు ఈరోజు చర్చ జరగడం వల్ల ఈ నాటి ఈ పరిస్తితికి కారణం.
ఉదాహరణకు కంచ ఐలయ్య సమాజం లో సంపద అట్టడుగు వర్గాల చేతిలో లేదు అని అన్నారు, ఇది వాస్తవం. దీనికి భారత దేశం లో వేళ్ళూనుకుని ఉన్న కుల వ్యవస్థ ముఖ్యమైన కారణం, కులవ్యవస్తని కూకటివేళ్ళతో పెకలించవలసిన తక్షన ఆవశ్యకత ఈదేశం లో ఉన్నది. ఆయన అభిప్రాయం ప్రకారం భారతీయ సమాజ ప్రగతిని కుల వ్యవస్థ నిరోదిస్తూ ఉన్నది, ఇది వాస్తవమేకదా! అసలు చర్చ దీనిపై జరగవలసి ఉన్నది.
ఒక సర్వే ప్రకారం భారత దేశ మొత్తం సంపదలో 46 % కేవలం 1% ప్రజలదగ్గర ఉన్నది. సమాజం లో అత్యధిక శాతం ఉన్న BC, SC లు దీనిలో లేకపోవడం అందరూ అంగీకరించవలసిన వాస్తవం. దేశసంపదలో ప్రతీ ఒక్కరికీ భాగం ఉంది. ప్రతీ వర్గం ఆయా వర్గాల జనాభా దామాషా ప్రకారం వాటాల పంపకం జరగాలిసిన అవసరం ఒక వేళ అలా జరగకపోతే ఆదిశగా కృషి చెయ్యవలసిన ఆవశ్యకత పై చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఇలాంటి మౌలికమైన అంశాలను ఐలయ్యగారు విస్తృతం గా వివరించారు.
ఇక్కడ కంచ ఐలయ్యగారు ఇచ్చిన సూత్రీకరణ ప్రకారం సమాజం లో సంపద మొత్తం కోమట్లు లేదా వ్యాపార కులాల వద్దనున్నది, అంటే 15% ప్రజలు ఈ సంపదని కలిగి ఉన్నాయి. నిజానికి సమాజం లో సంపద ఉన్న కులాలు కోమట్లు లేదా వ్యాపారకులాలు ఐనప్పటికినీ ఆయాకులాలకు చెందిన వారందరిదగ్గరా కాదు. ఆయన అభిప్రాయం ప్రకారం 46% మొత్తం సంపద 15% ఉన్న కులాల చేతిలో ఉండాలి కానీ, సర్వేలు చెప్తున్నవి కేవలం 1% మాత్రమే, మరి ఈ మాటలు మిగిలిన 14% మందికి ఆగ్రహం కలిగించడం సర్వ సాధారణమే కదా?
అంబానీ అదానీలు వ్యాపారకులాలలో ఉండి సంపద వారిగిప్పెట్లో ఉన్నది అన్నది ఎంత వాస్తవమో, వీధి చివరి పచారీ షావుకారి కి అందరిలాగే ఈ సంపద లో భాగం లేదు అనేది అంతే వాస్తవం. కంచ ఐలయ్య ఆయన మొత్తం పుస్తకం లో ఈ చిదిలమౌతున్న చిన్న వ్యాపారుల ప్రస్తావన తీసుకుని రాకపోవడం మనం గమనించ వలసిన విషయం. నిజానికి వీరుకూడా అందరివలెనే కార్పోరేటు అంబానీ అదానీ ల బాధితులే.
కాబట్టి కులమే ప్రాతిపధికగా ఐలయ్యగారి సూత్రీకరణకి ఇంత వ్యతిరేఖత వచ్చిందే తప్ప అంబానీ అదానీ మొదలైన వారిని విమర్చించిన కారణం చేత కాదు.
కంచ ఐలయ్య ఆయన పుస్తకం లో వైశ్యులు ఉత్పాదక రంగం లో లేరు అని అన్నారు. పారిశ్రామిక విప్లవానికి మునుపు ఉన్న భారతీయ గ్రామీణ వ్యవస్త వరకూ ఇది వాస్తవం కావచ్చు, కానీ నేటి కాలమాన పరిస్తితుల ఆధారం చూస్తే ఇప్పటి ఆర్దిక వ్యవస్థ 'మార్కెట్ ఎకానమీ', ఐలయ్యగారు ఈనాటి కార్పోరేట్ వ్యవస్థని ఆనాటి వ్యవసాయం కులవృత్తుల ఆధారం గా ఉన్న చతుర్వర్న ప్రేంవర్క్ లో ఇమిడ్చే ప్రయత్నం చేసారు, ఒకవేళ ఆ నాటి మలెనే కులవృత్తులు చెయ్యలేని వ్యవసాయం చేయలేని వారు ఉత్పాదక రంగం కాదు అనే జనరల్ సూత్రీకరణ చేసారు.
కానీ ఈనాటి బ్యాకింగ్, మార్కెటింగ్, సాప్ట్ వేర్, ఫార్మా మొదలైన పరిశ్రమలలో పనిచేసే వివిధ స్తాయి ఉద్యోగులని ఉత్పాదక రంగం కాదు అని చెప్పగలమా?
నా అభిప్రాయం లో భారతీయ వర్ణ వ్యవస్తలో శూద్రులు మరియు ఇతరకులాల వారు చదువుకోవడానికి వీలులేదు, వారు వారి వారి కుల వృత్తులు మాత్రమే చెయ్యాలి అని చెప్పడం ఎంత అన్యాయమో, నేటి వ్యవసాయేతర కులాలన్నిటిని ఇప్పుడు వ్యవసాయం చెయ్యి అనిచెప్పడం అంతే అన్యాయం.
నేటికి మన సమాజం లో అణగారిన కులాల పట్ల వివక్ష ఏదో ఒక స్థాయిలో ఉనందన్నది ఎంతటి కఠోరవాస్తవమో, కానీ అదే సమయం లో అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వైశ్యకులం మొత్తాన్ని స్మగ్లర్లుగా చెప్పడం అంతే అన్యాయం.
కుల వ్యవస్తని, వివక్షని వ్యతిరేకించే ఒక సోషల్ సైంటిస్ట్ కు, ఇప్పటివరకూ వివక్ష ని అనుభవించని తెలియని కులాలని కసిగా తిట్టడం వల్ల జరిగే ప్రయోజనం సూన్యం, అది కూడా ఒకరకమైన కుల వివక్షనే, అన్న ప్రొగ్రసివ్ out look ఉండవలింది.
ఇంగ్లీష్ లో ఆ పుస్తకం పేరు social smugglers, Telugu అనువాదానికి పెట్టిన సామాజిక స్మగ్లర్లు - కోమటోల్లు అన్న పేరు కచ్చితం గా 'ప్రొవకేటివ్'నే.
నాకు లాజిక్ దొరకని కొన్ని పాయింట్స్
- కంచ ఐలయ్య ఆయన పుస్తకం లో కోమట్లు వట్టి పిసినారి వాళ్ళు అంటూనే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అన్నారు.
- కోమట్లు వట్టి పిరికి వారు కాబట్టి వారు సైన్యం లో లేరు, వీరు వెజిటేరియన్ తింటారు, అందువల్ల సైన్యం లో యుద్దం చెయ్యలేరు చేసినా బీఫ్ తినే చైనా, పాకిస్తాన్ లచేతిలో ఓడిపోతారు.
- కోమట్లు ఇప్పటికీ ధనాన్ని భూమిలో దాస్తున్నారు అందువల్ల సమాజం లో ధనం సర్కులేట్ అవ్వకుండా ఆపి మన GDP పెరగకుండా చేస్తున్నారు.
- కోమట్లు అన్యాయం గా వ్యాపారం చేస్తారు.
నాకు అర్థం కానివిషయాలు ఏంటంటే, పిసినారి వాళ్ళు డబ్బు ఖర్చు చేసి విలాసవంతమైన జీవితాలని గడుపుతారు అనడం ఒక statement కి మరొకటి కాంట్రాడిక్టరీ గా ఉన్నది.
నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో యుద్దం చెయ్యడానికి బీఫ్ తిని కండలు పెంచవలసిన అవసరం లేదు, మిస్సల్ లు ప్రయొగించడం అంటే వాటిని మోసుకెళ్ళి శతృవుల పై వేయడం కాదు. ఒక social scientist గా వైశ్యులు సైన్యం లో లేరు అని చెప్పే ముందు ఆ సమాచారం యొక్క రిఫెరెంన్స్ ఇవ్వవలిసి ఉన్నది. అలా కాక Jat regiment లాగా వైశ్యా రెజిమెంట్ లేదు అందుకే వారి భాగస్వామ్యం లేదు అని conclude చెయ్యడం అంటే, Bihar, Sikkim, madras regiments ఉన్నాయి మరి తెలుగు / ఆంద్రా regiment లేదు అనువల్ల మన తెలుగు వారికి ఆర్మీలో భాగస్వామ్యం లేదు అని అనడం లాంటింది.
నేటి సమాజం లో బ్లాక్ మనీ దాచుకునే అనేక మార్గాలు ఉండగా భూమిలో ఇప్పటికీ ధనం దాచుకునే వాళ్ళు అంటే వాళ్ళు అయోమయం గాళ్ళే.
వ్యాపారం ఫలానా కులం వాళ్ళు న్యాయం గా చేస్తారు అని ఏదైనా సర్వేలోనో లేక ఒక గుర్తింపు ఉన్న సంస్థ నో certify చెస్తే ఆకులపు వారే వ్యాపారం చెయ్యాలి అని GO వచ్చేలాగా కృషిచేద్దాం.
ఇలా ఒక social scientist గా కంచ ఐలయ్య గారు భారతీయ సమాజం లో యొక్క కాంప్లెక్షిసిటీని అర్థం చేసుకోవడానికి ఇలాంటి General Formulations తో కాకుండా ఒక కనస్ట్రక్టివ్ criticism వస్తే అది భావిసమాజానికి ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం.
- VISWANADH JAYANTHI
No comments:
Post a Comment