Tuesday, 26 September 2017

వివక్ష పాలిట ‘వివక్ష ‘ !

వివక్ష .( discrimination ) ఇది లాటిన్ పదం ఐన discriminat నుండీ సంగ్రహించ బడింది. దీనికి broad గా the unjust or prejudicial treatment of different categories of people, especially on the grounds of race, age, or sex. అనే డెఫినెషన్ ఉంది. 

ప్రపంచం లో దాదాపు అన్ని దేశాలలో వివక్ష అనేది ఏదో ఒక రూపం లో ఉంది. వివక్ష అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది జాతి వివక్ష (racism). నల్లతెల్ల జాతీయుల సమస్య గా ఇది ఎక్కువగా కనబడుతుంది. 

భారత దేశం లో నైతే కుల వివక్ష (casteism) అగ్రకులాలుగా మరియు నిమ్నవర్గాలుగా చెప్పబడుతున్న వారి మద్య సమస్య గా కనబడుతుంది. 

కానీ ఆయా వివక్షలు కేవలం ఆయా సమాజాలకేపరిమితం, ఉదాహరణకి Burakumin లను జపాన్ దేశం లో un-touchables గా చూస్తారు. కానీ వారికి మరేదేశం లోనూ ఆ ఇబ్బంది దాదాపు ఉండకపోవచ్చు. 

మానవచరిత్రలో ఆ సమాజం ఈ సమాజం అని తేడాలేకుండా, ఆ మతం ఈ మతం అని భేదం లేకుండా ప్రపంచం లో అన్నిదేశాల్లోన్నూ ఉన్న ఒకే ఒక వివక్ష లింగ వివక్ష. లింగవివక్ష లేదా sexism అనేది వివిధ రకలుగా ఉన్నప్పటికీనీ దీనియొక్క ప్రధాన బాధితులు స్త్రీలే. 

planet 50/50 అంటూ ఎన్ని ప్రచారాలు చేసినా, స్త్రీల విషయంలో పెద్ద ప్రగతి సాధించినదేదీ లేదు అని చెప్పవచ్చు. కొన్ని దేశాలలో ఐతే వారి మత గ్రంధాల ప్రకారం, మొన్నటివరకూ కూడా స్త్రీ ఒక వస్తువుగానే (object status ) చూసారు, నేను ఇదే విషయాన్ని నా స్నేహితునితో నిన్న మాట్లాడుతున్నప్పుడు ఇది women’s డే కాదుకద, మనం ఈ విషయాలను చర్చించుకోవడానికి అని గొంతునిండా వెటకారం నింపుకుని అన్నాడు. 

అప్పుడు నేనతనితో అన్నాను, ఈవారం లోనే Opha may Johnson గురించి వాషింగ్టన్ పోస్ట్ లో వచ్చిన కథనం, women reservation bill గురించిన అంశం లో ప్రతిపక్ష నాయకురాలు ప్రధానికి రాసిన లేఖకి సంభంధించిన కథనం మరియు BHU విద్యార్ద్ధునిల ప్రొటెస్ట్ కి సంభంధించిన కథనం, India లో ఉన్న అన్ని పత్రికలలోనూ ప్రముఖం గా ప్రచురితం అయ్యాయి ఇంతకన్నా ప్రత్యేక సందర్భం ఏం ఉంటుందని స్తీల గురించిన లింగ వివక్ష పైన మాట్లాడుకోవడానికి అని నేను అడగగానే అతను సైడైపోయాడు. 

ఎందుకో మనకి ఈ సమస్య కుల, జాతి వివక్షలకన్నా తక్కువ ఇంటెన్సిటీ ఉన్నది గా అనిపిస్తుంది. " అంటే పోరాడే వివక్ష ఎంపికలో కూడా వివక్షనే అన్న మాట". ఈ దేశంలో దళిత జనోద్ధరణకోసం కంకణం కట్టుకున్న వారు వీధికొకరిని మనం చూస్తాం. మనువాదన్ని మోడరనైజ్ చేసి దానిలో ఉన్న అంశాలకు నాసా సర్టిఫికేట్ లు తెచ్చే ప్రయత్నం లో ఉన్నవారేకాకుండా, వారి వారి ప్రయారిటీలని బట్టి మనువాదన్ని వ్యతిరేకిస్తున్న నయా అభ్యుదయ వాదులు కూడా వారివారి పరిధిలో యధాశక్తి లింగ వివక్షకు పాల్ల్పడుతూనే ఉన్నారు. 

2015 word bank సర్వే ప్రకారం మొత్తం 173 దేశాలకు గాను 155 దేశాలలో ఇప్పటికీ వారి వారి work places లలో లీగల్ obstacles ఉన్నయన్న విషయం బయటపడింది అంటే పరిస్తితి తీవ్రతను అంచనావేయడం మనకి చాలా సులభం. ప్రపంచం అంతా అలా ఉందేమో లేదా ఏ ఇస్లాం మతం అధికారిక మతం గా ఉన్నదేశం లో అలా వుందేమో, స్త్రీని ఆదిశక్తిగా కొలిచే ఈ దేశం లో అలాంటి పరిస్తితులకి తావులేదు అని అనుకునే వారు తప్పులో కాలేసినట్టే. 

డేటా పాయింట్స్ ఏం చెప్తున్నాయి అంటే 
UNDP Gender inequality index 2014 ప్రకారం  మనదేశం 152 దేశాలకు గాను 127 వ స్తానం లో ఉండగా, కేవలం SAARC దేశాలను మాత్రమే పోలిస్తే మన దేశం  అట్టడుగు నుండి రెండవ స్తానం లో ఉంది. 
World Economic Forum Global gender gap Index 2014 ప్రకారం స్టడీ చేసిన నాలుగు మేజర్ ఏరియాలలో 114 స్తానం లో ఉంది (n-142)
Economic participation and opportunity: 134th
Educational achievements: 126th
Health and Life expectancy: 141st

అత్యంత బాధాకర విషయం ఏమిటంటే incidents of crime against women, ప్రతీసంవత్సరం గణనీయం గా పెరగడం. 2011 నుండీ 2015 వరకూ 42% నుండీ 54%. వరకూ reported crime rate ఉంది. ఇక్కడ women పైనజరిగిన చాలావరకూ నేరాలు మనదేశంలో పరువు పేరిటనో లేదా ఇంకేదయినా కారణం చేతనో unreported గా ఉంటాయి అని మనం గమనించాలి. 

చివరిగా నేను చెప్పేది ఏంటంటే women discrimination అనేది మన మతాచారాలు మరియు సంస్కృతిలో భాగం గా కలిసిపోవడం వల్ల వివక్ష పట్ల స్పందించే సెన్సిబిలిటీని మన సమాజం కోల్పోయింది. అందువలన Humanism వంటి alternative లైఫ్ స్టైల్ ని మనసమాజం adopt చేసుకున్నట్లైతే ఆ sensibility ని తిరిగి మన సమజం లో నింపే ప్రయత్నంచేయవచ్చు. 


-Viswanadh Jayanthi 

No comments:

Post a Comment

Tips to make online education more utilitarian

  Tips to make online education more utilitarian 1.     Serious Learning Approach:   When you are attending online classes, you need m...